IPL 2021 : After playing just two matches in the second leg of the 14th season of the Indian Premier League, explosive batsman Chris Gayle decided to leave the tournament.
#IPL2021
#ChrisGayle
#PunjabKings
#PBKS
#biobubble
#KLRahul
#Cricket
ఐపీఎల్ 2021 రెండో దశ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం కొన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (16) కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (14) ప్లే ఆఫ్స్‌కు చేరువలోనే ఉంది. మరో విజయం సాధిస్తే.. దాదాపుగా బెంగళూరు కూడా టాప్-4లో చోటు దక్కించుకుంటుంది.